Thursday, April 4, 2013

143 ప్రత్యేకత...

(I Love You-143) ‘ఐ లవ్ యూ అంటే... ఛీ కొట్టిపోతావ్ అన్నా, ఐ లవ్ యూ అంటే... రారమ్మంటున్నా ఇవి ఈ మధ్య యూత్‌లో వినిపిస్తున్న ప్రేమరాగాలు. అయితే ఐ లవ్ యూ అనేది హలో చెప్పినంత ఈజీగా అయిపోయింది. కుర్రకారు గుండెల్లో రైలులా పరిగెట్టే ఐ లవ్ యూ  సైన్స్ పరంగా ఆక్షరణ, అయస్కాంతత్వం అనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే 143 ఎందుకింత ఫేమస్ అయ్యిందో మనకు తెలియదు కానీ, మన ఊహనలో 143 కి చాలా ప్రత్యేకత ఉంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం!

 1.
 నువ్వు-నేను 1టైన వేళ 4 దిక్కుల సమక్షంలో నీ మెడలో 3 ముళ్లు వేస్తా : 143

 2.
 143 నంబర్‌ను ఒక ట్లు, పదులు, వందల స్థానంలో ఒకటి తక్కువ చేసి చూద్దాం
 032 కదా   
 అలాగే ఒకటి ఎక్కువ చేసి చూద్దాం
 254 కదా
 పై రెండింటి సరాసరి : (032+254)/2 = 143

 3.
 143 అనది ఒక పాలిన్‌రోమ్ నంబర్
              143
            143
          143
        143
      ----------
       158873
      ----------
 పాలిన్‌రోమ్ అంటే మూండంకెల సంఖ్యను తీసుకొని పై క్రమంలో మాదిరిగా వేసి కూడితే వచ్చిన మొత్తంలో మొదటి రెండు నంబర్‌లను ఒక సంఖ్యగా భావించి, తర్వాత చివరి రెండు నంబర్‌లను మరో సంఖ్యగా భావించి వాటిని కూడినట్లైతే మధ్యలో ఉన్న రెండంకెల నంబర్ వస్తుంది.
 అంటే... 15+73 = 88, అందువలన 143 ఒక పాలిన్‌రోమ్.

 4.
 1+4+3 = 8 కదా
 ఇందులో ఉన్న గమ్మత్తేంటో ఇప్పుడు చూద్దాం...
 గణితంలో తొమ్మిది అంకెలుంటాయి.
 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9
     అందులో ప్రతిదానికి రెండు కొనలుంటాయి. ఆ రెండు కొనలు ఇద్దరి మధ్య ప్రేమ అనుకుంటే... 8 తప్ప మిగతా అంకెలలో మొదటి, చివరి కొనలుంటాయి. ఈ బిందువులకి మధ్య ఏదో ఒక మార్గం వాటిని కలుపుతుంది. కానీ 8 అంకెలో ఆది, అంత్య బిందువులను గుర్తించడం కష్టం. ఆ రెండు బిందువులు తనలో తాను కలిసిపోయి ఉంటాయి. ఆ గొప్పతనం 8 అంకెకుంది. అంటే 143 నంబర్‌కుంది. అంటే 'I Love You'అంత పవర్‌ఫుల్ వ్యాఖ్యమన్నమాట.
     రెండు మనసులు ఒకటవ్వాలంటే దానికి శుభసూచికం ప్రేమికులదినోత్సవం.
 Happy Valentines Day - HVD - హృదయం వికసించే దారి

రంగుల హోలి

 రంగుల హోలి
 అనాథలపై ఉండాలి జాలి
 మగవాడికి తోడుండాలి ఆలి
 ప్రేమకావాలంటే మనసుకు ఉండాలి ఖాళి
 పెళ్లికి తప్పకుండా కావాలి తాళి
 ఆనందానికి హరివిల్లు ఈ హోలి

కల


 కలల్ని సాధించుకుంటే అందమైన భవిత
 కలల్ని నిజం చేస్తే ఆనందిస్తుంది వనిత
 కలను కలగా ఉంచితే కలత...
కలల్ని కమ్మని భావాలుగా మార్చేది కవిత

అందం-బంధం

 సృష్టికి అందం పంచభూతాలు
 జాబిలికి అందం వెన్నెల
 వసంతానికి అందం కోయిల గానం
 ప్రేమకు అందం ప్రేయసి
 ప్రేయసి అందం ప్రియుడి
బంధం

ప్రేమ లేని మనసు లేదు...

 మరణం లేని ప్రాణి లేదు
 ఓటమి లేని ఆట లేదు
 ప్రేమ లేని మనసు లేదు
 నీవు లేని జీవితం లేదు

నీవు లేనిచో... నాకు లోకమే లేదు

 నీ శ్వాసలేని నా ఊపిరి లేదు
 నీ నవ్వు లేని సంతోషం లేదు నీ స్పర్శలేనిచో నాలో చలనం లేదు
 నీవు లేకపోతే నా ప్రేమకు అర్థం లేదు

నిను వీడలేను...

 దేవుడు పేద కాదు
 నిజానికి మరణం లేదు
 వెన్నెలకు వేడిమి తెలియదు
 తప్పుకు శిక్ష తప్పదు
 రహస్యం గుట్టు విప్పదు
 అల ఒడ్డుకు చేరక మానదు
 నా ప్రేమ నిన్ను విడవదు