Thursday, April 4, 2013

143 ప్రత్యేకత...

(I Love You-143) ‘ఐ లవ్ యూ అంటే... ఛీ కొట్టిపోతావ్ అన్నా, ఐ లవ్ యూ అంటే... రారమ్మంటున్నా ఇవి ఈ మధ్య యూత్‌లో వినిపిస్తున్న ప్రేమరాగాలు. అయితే ఐ లవ్ యూ అనేది హలో చెప్పినంత ఈజీగా అయిపోయింది. కుర్రకారు గుండెల్లో రైలులా పరిగెట్టే ఐ లవ్ యూ  సైన్స్ పరంగా ఆక్షరణ, అయస్కాంతత్వం అనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే 143 ఎందుకింత ఫేమస్ అయ్యిందో మనకు తెలియదు కానీ, మన ఊహనలో 143 కి చాలా ప్రత్యేకత ఉంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం!

 1.
 నువ్వు-నేను 1టైన వేళ 4 దిక్కుల సమక్షంలో నీ మెడలో 3 ముళ్లు వేస్తా : 143

 2.
 143 నంబర్‌ను ఒక ట్లు, పదులు, వందల స్థానంలో ఒకటి తక్కువ చేసి చూద్దాం
 032 కదా   
 అలాగే ఒకటి ఎక్కువ చేసి చూద్దాం
 254 కదా
 పై రెండింటి సరాసరి : (032+254)/2 = 143

 3.
 143 అనది ఒక పాలిన్‌రోమ్ నంబర్
              143
            143
          143
        143
      ----------
       158873
      ----------
 పాలిన్‌రోమ్ అంటే మూండంకెల సంఖ్యను తీసుకొని పై క్రమంలో మాదిరిగా వేసి కూడితే వచ్చిన మొత్తంలో మొదటి రెండు నంబర్‌లను ఒక సంఖ్యగా భావించి, తర్వాత చివరి రెండు నంబర్‌లను మరో సంఖ్యగా భావించి వాటిని కూడినట్లైతే మధ్యలో ఉన్న రెండంకెల నంబర్ వస్తుంది.
 అంటే... 15+73 = 88, అందువలన 143 ఒక పాలిన్‌రోమ్.

 4.
 1+4+3 = 8 కదా
 ఇందులో ఉన్న గమ్మత్తేంటో ఇప్పుడు చూద్దాం...
 గణితంలో తొమ్మిది అంకెలుంటాయి.
 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9
     అందులో ప్రతిదానికి రెండు కొనలుంటాయి. ఆ రెండు కొనలు ఇద్దరి మధ్య ప్రేమ అనుకుంటే... 8 తప్ప మిగతా అంకెలలో మొదటి, చివరి కొనలుంటాయి. ఈ బిందువులకి మధ్య ఏదో ఒక మార్గం వాటిని కలుపుతుంది. కానీ 8 అంకెలో ఆది, అంత్య బిందువులను గుర్తించడం కష్టం. ఆ రెండు బిందువులు తనలో తాను కలిసిపోయి ఉంటాయి. ఆ గొప్పతనం 8 అంకెకుంది. అంటే 143 నంబర్‌కుంది. అంటే 'I Love You'అంత పవర్‌ఫుల్ వ్యాఖ్యమన్నమాట.
     రెండు మనసులు ఒకటవ్వాలంటే దానికి శుభసూచికం ప్రేమికులదినోత్సవం.
 Happy Valentines Day - HVD - హృదయం వికసించే దారి

రంగుల హోలి

 రంగుల హోలి
 అనాథలపై ఉండాలి జాలి
 మగవాడికి తోడుండాలి ఆలి
 ప్రేమకావాలంటే మనసుకు ఉండాలి ఖాళి
 పెళ్లికి తప్పకుండా కావాలి తాళి
 ఆనందానికి హరివిల్లు ఈ హోలి

కల


 కలల్ని సాధించుకుంటే అందమైన భవిత
 కలల్ని నిజం చేస్తే ఆనందిస్తుంది వనిత
 కలను కలగా ఉంచితే కలత...
కలల్ని కమ్మని భావాలుగా మార్చేది కవిత

అందం-బంధం

 సృష్టికి అందం పంచభూతాలు
 జాబిలికి అందం వెన్నెల
 వసంతానికి అందం కోయిల గానం
 ప్రేమకు అందం ప్రేయసి
 ప్రేయసి అందం ప్రియుడి
బంధం

ప్రేమ లేని మనసు లేదు...

 మరణం లేని ప్రాణి లేదు
 ఓటమి లేని ఆట లేదు
 ప్రేమ లేని మనసు లేదు
 నీవు లేని జీవితం లేదు

నీవు లేనిచో... నాకు లోకమే లేదు

 నీ శ్వాసలేని నా ఊపిరి లేదు
 నీ నవ్వు లేని సంతోషం లేదు నీ స్పర్శలేనిచో నాలో చలనం లేదు
 నీవు లేకపోతే నా ప్రేమకు అర్థం లేదు

నిను వీడలేను...

 దేవుడు పేద కాదు
 నిజానికి మరణం లేదు
 వెన్నెలకు వేడిమి తెలియదు
 తప్పుకు శిక్ష తప్పదు
 రహస్యం గుట్టు విప్పదు
 అల ఒడ్డుకు చేరక మానదు
 నా ప్రేమ నిన్ను విడవదు

ఆపలేం

 అరచేయి అడ్డుపెట్టి సూర్యాన్ని
 గొడుగు పట్టి వర్షాన్ని ఆపలేం
 దుప్పటితో వెన్నెల చల్లదానాన్ని ఆపలేం
 మన స్నేహం ఎప్పటికీ ఒకరికొకరం ఆపలేం
ఆపలేం

కల నిజంకాదు... నిజం కలకాదు

 వచ్చే ప్రతి కల నిజంకాదు
 కురిసే ప్రతి చినుకు మంచి చేయదు
 నడిచే ప్రతీ కాలం కలిసి రాదు
 పూజించే ప్రతి ఒక్కరికీ దైవం వరమివ్వరు
 పుట్టినవారు మరణించక తప్పదు
 కానీ... నా ప్రేమ సజీవం అది ప్రతిజన్మకీ నిన్నే చేరుతుంది

కనుల ఎదుట నీవు...

 కనుల ముందు నీవుంటే కునుకు రాదు
 తీయగ మాట్లాడితే నా గొంతు మూగబోదు
 మనసు నిండా నీవుంటే నా ఆలోచన మలినం కాదు
 నా చేతిలో చేయేస్తే జీవితాంతం వదలను

కృష్ణం వందే జగద్గురుమ్

 నల్లనయ్య కృష్ణుడు
 వెన్నెలయ్య కృష్ణుడు
 వెన్నలయ్య కృష్ణుడు
 వేణువూదేవాడు కృష్ణుడు
 తారంగమాడేటి కృష్ణుడు
 గోపిలకు మన్మధ కృష్ణుడు

కృష్ణం వందే జగద్గురుమ్

శూన్యమైపోతుంది

 సూర్యుడు లేకపోతే లోకం చీకటైపోతుంది
 చంద్రుడు లేకపోతే ఆకసం బోసిపోతుంది
 నీరు లేక జీవులు విలవిలబోతాయి
 నీవు లేక నా జీవితం శూన్యమైపోతుంది

కమలం వికసించగలదా?

 సూర్యర శ్శి లేకుండా
 పూవుల మకరందాన్ని పీల్చకుండా తేనెటీగ ఉండగలదా?
 గాలి లేకుండా ప్రాణం నిలువ గలదా?
 బాధపడినపుడు కన్నీరు ఆగగలదా?
 కాలువలు, సెలయేర్లు, జలపాతాలు, సరస్సులు, నదులు సముద్రంలో కలవకుండా ఉండగలవా?
 అలాగే... నీవు లేకుండా నేనుండగలనా?
 నువ్వే చెప్పాలి ప్రియతమా...
కమలం వికసించగలదా?

చెప్పవే చెలీ...

 కనురెప్పలు మూయకుండా నిదరపోగలమా?
 పంచభూతాలు లేకుండా జీవించగలమా?
 చేతులు కలవకుండా చప్పట్లు కొట్టగలమా?
 నీ ప్రేమ లేకుండా ఉండగలనా?
 నువ్వే చెప్పాలి ప్రాణమా...

నిను చూడక నేనుండలేను...

 తల్లి తండ్రి కలవకుండా మనం పుట్టగలమా?
 కనురెప్పలు కలవకుండా చేయగలమా?
 పెదవులు కలవకుండా అమ్మ అని పలకగలమా?
 ఒక్క క్షణం నిన్ను చూడకుండా ఉండగలనా?

చెదరని నవ్వు...

 చెదరని నవ్వు
 చూస్తూండుపోయే సొగసు
 వెన్నలాంటి మనసు
 ఒంపుసొంపుల నడుము
 అందమైన పొడవాటి కురులు
 ఎర్రని అధరాలు
 ఇవన్నీ నన్ను కట్టిపడేస్తున్నాయ్ సఖీ...

నీ నవ్వు చాలు...

 నీ చిరునవ్వులు
 నీ చూపుల కైపుదనం నన్ను బందీని చేశాయ్
 నీ సొగసులు నన్ను మంత్రమగ్ధుల్నిచేశాయ్
 ఎందుకో మరెందుకో ఈ తొందరెందుకో...
హాయినిగొల్పుతాయ్

నువు మొక్కవైతే...


 నువు ఆకాశమైతే నేను మబ్బునౌతా
 నువు భూమివైతే నేను ధూళినౌతా
 నువు నిప్పువైతే నేను జ్వాలనౌతా
 నువు సముద్రమైతే నేను నీటిబొట్టునౌతా
నువు మొక్కవైతే నేను పూవునౌతా

నను తరుముతోంది

 నీ నిరీక్షణ
 నీ ఆలోచన నను వెంటాడుతోంది
 నీ చిరునవ్వు నను పలకరిస్తోంది
 నీ కౌగిలి నను బందీకమ్మటోంది
 ఏమిటో ఈమాయ....
నను తరుముతోంది

మొదటిసారి చూశా..


 నా ఎద తలుపులు తెరిచా
 కనులముందు, కలలయందు తానే ఉంది
 ప్రాణంగా ప్రేమించా...
 తానే సర్వస్వమనీ గ్రహించా...
 కానీ... ఏమైంది?
మొదటిసారి చూశా...

ప్రేమ




 మనసులోని సుగంధాల పరిమళమే ప్రేమ
 ఇరువురి భావాల మాధ్యమమే పేమ
 రెండు హృదయాల్లో కలిగే ఒకే సంకేతం పేమ
 మనసు మనసుకు ఇచ్చే వింత గిలిగింతే ప్రేమ