Monday, June 20, 2011

ప్రేమకు చోటులేదు

నాడు

+ ప్రేమ ఒక వరం

+ ప్రేమ ఒక రూపం

+ ప్రేమ ఒక ధైర్యం

+ ప్రేమ ఒక త్యాగం

+ ప్రేమ ఒక నమ్మకం

+ ప్రేమ ఒక సుగుణం

+ ప్రేమ ఒక మార్గదర్శకం

కాని...

నేడు

- ప్రేమ ఒక శాపం

- ప్రేమ ఒక వికృతి

- ప్రేమ ఒక పిరికితనం

- ప్రేమ ఒక స్వార్థం

- ప్రేమ ఒక అనుమానం

- ప్రేమ ఒక రాక్షస గుణం

- ప్రేమ ఒక వినాశనం

నేడు ప్రేమకు చోటులేదు

నీకు తగునా?

నువు లైలా

కాని నేను మజ్నుని కాను

నువు అనార్కలి

కాని నేను సలీమ్‌ని కాను

నువు పార్వతి

కాని నేను దేవదాసుని కాను

అయినా నన్ను ప్రేమించావ్

నాపై ప్రేమ సుగుంధాన్ని కురిపించావ్

కాని నువ్వేం చేశావ్

నోటి దాకా వచ్చిన ప్రేమ రుచిని లాగేశావ్

ఇది నీకు తగునా?

నువ్వే నా ప్రేమవి

నేను ఒక జాబిలిని

నువు నాలో వెలిగే వెన్నెలవి

నువు మేఘానివి

నువు నా నుండి జాలువారే తొలకరివి

నువు జలపాతాన్ని

నువు నా ప్రవాహంలో పలికే సరిగమవి

నేను ఒంటరిని

నువు నా ఒంటరితన్నాని పోగొట్టే ప్రేమవి

కఠినంగా శిక్షించాలి

కామ+అంధుడు = కామాంధుడు

అంధుడు అంటే గుడ్డివాడు


నేడు... కామం ఎగిసిపడే కెరటం

ఆడవాళ్ల ప్రాణాలని బలికొంటోంది

వారి నిండు భవిష్యత్ పాతాళమైపోతుంది

వాటిని చూసే మనం నిజమైన గుడ్డివాళ్లం

మనం చూస్తూ ఊరుకోకూడదు

కామాంధుడి కోరలు పీకి కఠినంగా శిక్షించాలి

అప్పుడే ఆడది అర్ధరాత్రి నడవగల్గుతుంది

లవ్ పవర్

స్ర్తీ అందం ముందు...

ప్రకృతి అందం కూడ విలవిల...

నా ప్రేమ ముందు...

సృష్టి కూడ తలవంచుతుంది...

అదే నా ప్రేమకున్నే పవర్...

తెలుసుకో

సూర్యుడు తెల్లవారుజామునొచ్చి సాయంత్రానికి కనుమరుగైనా

మళ్లి ఉదయిస్తాడని తెలుసు

జీవితంలో సుఖదుఃఖాలు ఎదురైనా

జీవితం సాగుతుందని తెలుసు

సముద్రంలో కెరటాలు, అలలు ఒకదానికొకటి ఢీకొన్నా

అవి ఎప్పటికీ కలిసుంటాయని తెలుసు

నాపై నీకున్న కోపం ఎప్పటికైనా ప్రేమగా మార్చలేకున్నా

నీకోసం పరితపించే ఊపిరి ఒకటుందని తెలుసుకో...

నిజం

ఆకాశం నీలి రంగులో ఉండటం ఎంత సత్యమో

సూర్యుని కిరణాలు భువిపై పడటమనేది ఎంత నిజమో

వెన్నెల చల్లగా ఉంటుందనేది ఎంత నిజమో

నేను నిన్ను ప్రేమించడం కూడ అంతే నిజం

కాని స్నేహంలో

పాటలో...

స్ర్తీ సాహిత్యమైతే పురుషుడు స్వరం

కోయిలలో...

స్ర్తీ గానమైతే పురుషుడు గొంతు

చీకటిలో...

స్ర్తీ వెన్నెలైతే పురుషుడు చంద్రుడు

ప్రేమలో...

స్ర్తీ అంతరమైతే పురుషుడు బాహ్యం

కాని స్నేహంలో...

స్ర్తీ-పురుష బేధాలు లేవు

నిద్ర ఆగిపోతోంది

నీకోసం నీరిక్షించే ఒక యువకుడి గాథ

ప్రతిక్షణం గుర్తొచ్చే చంద్రుడిలా ఉండే నీ ముఖం...

అనుక్షణం నను తాకే జాబిలి వెన్నెల ప్రవాహం...

క్షణక్షణం గుర్తొచ్చే తీపి జ్ఞాపకాల ఒడిలో నిదురవుతున్నా...

కాని... ఎన్నో రాత్రులు వేచియున్న...

కంటి మీద కునుకులేక నిద్ర ఆగిపోతోంది...

ఎప్పటికైనా నిన్ను ఏలుకోనే...

ఓ చిలిపి వన్నెల రాణి... అందాల యువరాజును నేనే...

ఓ స్వప్న రాత్రి

ఓ స్వప్న రాత్రి

విశాలవంతమైన ఆకాశం నా మనసులాగ

ననుతాకి వేగంగా పోయే గాలి నా ఆలోచనలాగ

నిండు జాబిలిని చూసి ఒక ప్రశ్న అడిగా...

ప్రేమ అంటే ఏంటి?

ఆ జాబిలి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా...

ప్రేమ ఒక మోసం, అంధకూపం, అసూయ, పిరికిది, వ్యర్థం, నేరం-ఘోరం

అని చెప్పింది...

వెంటనే ఉవ్వెత్తిన కెరటంలా లేచి... గట్టిగా...

రెండు మనసులు కలిసి కల్మషంలేని మరో మనసుగా ఉద్భవించడమే ప్రేమ అని అరిచాను

నిద్రలేని రాత్రి

ఓ వెన్నెల రాత్రి... అదే నా జీవితంలో నిద్రలేని రాత్రి

బయటకొచ్చి ఆకాశం వైపు చూశాను...

అక్కడున్న చంద్రుడు నావైపే అదోలా చూస్తున్నాడు...

ఎందుకబ్బా... అలా చూస్తున్నాడని... నేను తీక్షణంగా పైకి చూశా...

దాని నుండి ఎదో కాంతి నా హృదయంలోకి చొచ్చుకొనిపోయింది

నేను అలానే చంద్రుడి వైపు చూస్తున్నా...

ఆ వెన్నెల కాంతిలో చక్కటి రూపం నన్నే గమనిస్తున్నట్లుంది

అందమైన కళ్లు, ఎరుపెక్కిన బుగ్గలు, తడి ఆరని పెదవులు

ముఖంలో చిరునవ్వు...

ఆ రాత్రంతా నిద్రపట్టలేదు.....

ప్రేమంటే..?

నీకోసం... ఆలోచించిన రాత్రి...

ఏవో కలలు

నాలో కలిగే వింత భావాలు

నీ రూపం నీ కనుల ముందే కదలాడుతోంది

అందుకేనేమో...

నా కంటిపై కునుకు రావటం లేదు

ఇదేనా ప్రేమంటే..?

చిన్ని ఆశ

చిలిపి చిలిపి చేష్ఠలతో నను నవ్వించేది అనూష

ఆమె కాబోయే త్రిష

అల్లరి అల్లరి పనులతో నాలో నవ్వును అల్లింది ఒక ఉష

ఆ నవ్వు కలకాలం కావాలని ఓ చిన్ని ఆశ

ప్రేమ దెయ్యం

అల్లరి తుంటరి పనులతో నను అల్లుకునే ఒంటరి దెయ్యం

చిలిపి చిలిపి మాటలతో నను కవ్వించే తుంటరి దెయ్యం

వెన్నెలమ్మ వాకిట్లో మెరిసే నా వయ్యారి దెయ్యం

నా మనసంతా దోచుకన్నా చిలిపి ప్రేమ దెయ్యం

నువ్వేకావాలి

చినుకే లేని మేఘంను తాకి జల్లును కురిపించావ్

చీకటి జీవితానికి నీ చిరునవ్వును పంచి వెలుగును చూపించావ్

శిలలా ఉండే నా మనసును నీ స్పర్శతో జీవం పోశావ్

నా నీడలో నువు తోడుగా ఉంటావని మాటిచ్చావ్

నాకు ఇంకేం కావాలి, నువు తప్ప...

ఎదురుచూస్తోంది

నామది నిన్ను కోరుతోంది

నా పెదవులు నిన్నే తపిస్తోంది

నా చూపు నిన్నే విక్షీస్తోంది

నాకొచ్చే ప్రతి కల నీ రూపాన్నే చూపిస్తోంది

నా శ్వాస నీ శ్వాసతో కలవాలంటోంది

నా మనసు నీ మనసు తోడు కోసం ఎదురుచూస్తోంది

చిరకాలం ఉండాలి

చీకటిలో మెరిసే జాబిలమ్మవు నువ్వు

ఆ జాబిలికి ఉండే చల్లని వెన్నెల నీ మనసు

ఆ మనసులో నుండి పుట్టింది నాపై ప్రేమ

ఆ ప్రేమ చిరకాలం ఉండాలని కోరుతున్నా....

గాయం చేసే సుందరి

అలుపెరగని జీవితానికి అలసట తెలియకుండా దాహం తీర్చే నీటివి నువ్వు

ఎండకు వానకు గురికాకుండా చేయూత నిచ్చే గోపురానివి నువ్వు

మంచేదో చెడేదో తెలియజెప్పే మార్గదర్శివి నువ్వు

నా హృదయానికి గాయం చేసే నా స్వప్నసుందరివి కూడ నువ్వే...

మరవగలనా?

వాన మేఘాన్ని మరవగలదా?

అలలు సముద్రాన్ని మరవగలదా?

తేనెటీగ మకరందాన్ని మరవగలదా?

వెన్నెల జాబిలిని మరవగలదా?

నేను నిన్ను మరవగలనా?

నీ కోసం

వీచే గాలి నిన్ను వీక్షిస్తోంది

కదిలే జలపాతం నిన్ను కలవరిస్తోంది

పక్షుల అరుపులతో నీ నామం మ్రోగిపోతోంది

ఏదో తెలియని స్వప్నం నను వెంటాడుతోంది

పంచభూతాలు నిన్ను నా వద్దకు రమ్మని స్వాగతిస్తున్నాయి

మరి వస్తావా..! నీ కోసం ఎదురు చూస్తుంటా..!

చాలా ఇష్టం

నీ తీయని పెదవులకు నా పేరంటే ఇష్టం

నా వలపు చూపులకు నీ అందమంటే ఇష్టం

నా గానకోకిలకు నీ గొంతు అంటే ఇష్టం

మొత్తానికి నేనంటే నీ మనసుకు చాలా ఇష్టం

స్నేహాన్ని విడవకు

వేగంగా ప్రయాణించేది మనసు

ఆ మనసు మోసపోయేది మాత్రం ప్రేమలో

ఈ విషయాన్ని దేన్నడిగినా చెప్తాయి ఈ భువిలో

భువిలో అయ్యే ఏ పనికైనా వేగంగా స్పందించేది స్నేహం

స్నేహాన్ని మరవకు, మరిచే స్నేహం చేయకు

అసలు స్నేహాన్ని విడవకు... మిత్రమా..!

ఎంతో విలువైనది

జాబిలి నుండి జాలువారే వెన్నెల

కోయిల గొంతు నుండి జారే సరాగాలు

మల్లెలు నుండి వీచే సువాసనలు

రెండు మనసుల నుండి పుట్టే ప్రేమ కన్నా

మన స్నేహం ఎంతో విలువైనది

యవ్వనము ఉరకలేసింది

జాబిలిని చూసి మది పులకించింది

కోయిలరాగం మనసుకు హాయినిచ్చింది

నీ స్పర్శతో నా యవ్వనము ఉరకలేసింది

ఎన్ని జన్మలకైనా నాలో అర్ధబాగం నువ్వే

ఏమంటావ్..?

నా ప్రేమ నిత్యం

నాలో కలిగే ప్రతి స్వప్నానికి కారణం నువ్వు

నాలో సవ్వడి చేసే మది అలజడులకు కారణం నువ్వు

నేను నేనుగా లేకుండా ఉండటానికి కారణం నువ్వు

ఈ జగత్‌లో నా ప్రేమ నిత్యం ప్రహహించడానికి కారణం కూడ నువ్వే...

నా అణువణువు నువ్వే

పలికే ప్రతిమాటలో తీయదనం నువ్వు

పీల్చే గాలిలో నా ప్రాణవాయువు నువ్వు

పూసే ప్రతి పువ్వులోను మకరందం నువ్వు

నా అణువణువులోని దాగున్నది కూడ నువ్వు

ఎదురుచూస్తూ ఉంటా

నేను పలికే ప్రతిమాటలో నువ్వుంటావు

నా శ్వాసలో నీ స్మరణ ఉంటుంది

నా ఊహల ఊయలలో నీ రూపం కనిపిస్తూనే ఉంటుంది

నా మనసంతా నీ రాకకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది

ఎందుకంత అలుసు

నీ గానం నాకు ప్రాణం

నీ పిలుపు తీయని వలపు

నీ మనసు చల్లనిదని తెలుసు

కాని... నేనంటే ఎందుకంత అలుసు

జన్మ ధన్యం

తెల్లవారుజామున కోడి కొక్కొరోకో అనలేదని

కోయిల రాగాలు వినపించలేదని

సూర్యుడు నీ కనులపై కాంతిని పంపలేదని

ఈ ప్రకృతి నీకు శుభోదయం చెప్పలేదని

వీటిపై ఉన్న కోపం నాపై తగునా! మిత్రమా!

ఇవ్వేమి నన్ను విష్ చేయకపోయినా!

నువ్వు పలకరిస్తే చాలు నా జన్మ ధన్యం..!

ప్రేమ వాయువు

వెన్నెలతో చెప్పనా నీ కన్నా అందమైన వెన్నెల ఉందని

నింగితో చెప్పనా నీ కన్నా విశాలవంతమైన మనసు ఉందని

గాలితో చెప్పనా అసలు కలుషితమవ్వని ప్రేమ వాయువు ఉందని

జాబిలితో చెప్పనా నీ కన్నా మంచి ఫ్రెండ్ దొరికిందని!

చందమామ అడిగింది

కటిక చీకటిలో మెరిసే కాంతివి నువ్వు

బుడిబుడి నడకలు వేసే జడివానవు నువ్వు

చిరుచిరు గాలుల సమూహంలో శ్వాస గాలివి నువ్వు

ఇవన్నీ చూసిన చందమామ ఎవరు అని అడిగింది నన్ను

వెంటనే నీ కన్నా మంచి స్నేహితురాలు దొరికిందని చెప్పా

సరిగమవి నువ్వు

నాలో పలికే ప్రతి రాగానికి సరిగమవి నువ్వు

నాలో వచ్చే ప్రతి ఆలోచనకు నిజరూపం నువ్వు

నాలో కలిగే ఆనందానికి కారణం నువ్వు

నాలో తీయని భావాలు నీ జ్ఞాపకాలు

ప్రతిరూపం నువ్వు

కారుమబ్బుల చీకటిలో మెరిసే తారవు నువ్వు

నా ప్రేమ అలను ప్రేమతో పలకరించే ఉవ్వెత్తిన కెరటం నువ్వు

నా గుండె చప్పుడు ఆగకుండా అడ్డుకునే ప్రేమ పాశము నువ్వు

ప్రతిఅడుగు తోడుగా ఉండే నా నీడకు ప్రతిరూపం నువ్వు

కోయిల నువ్వు

ఆకాశంలో మెరిసే తారవు నువ్వు

నాపై కురిసే ప్రేమజల్లువి నువ్వు

వెన్నెల అందించే చల్లని జాబిలి నువ్వు

నాలో ప్రేమరాగాలను పలికించే కోయిల కూడ నువ్వే

Tuesday, June 7, 2011

మరణం లేదు

ఆకారం లేదు నీరుకి

అంతే లేదు ఆకాశానికి

భారం లేదు భూమికి

గమ్యం లేదు ప్రవాహానికి

జాలి లేదు కాలానికి

మరణం లేదు నా ప్రేమకి

మరవలేను

కళ్లు పలికే ఊసులు

కనులకేమో చూపులు

కలల్లో కాసే ఆశలు

నైట్ టైమ్ మేసెజ్‌లు ఫోన్‌లు

తను పంపే బహుమతుల కొరియార్లు

చాటింగ్‌లో తుంటరి వేషాలు

మాట వినకపోతే కోపాలు

నా మీద తన అలకలు

తన మాటలతో నాలో కవ్వింతలు

కలిసినపుడు చిలిపి చేష్టలు

తనపై కురిపించే ముద్దులు

నన్ను బంధించే కౌగిట్లు

వినిపించే నా హృదయ రాగాలు

రాశా తనపై నా మదిలో కవితలు

విడదీశాయి మమ్మల్ని కాలాలు

అర్థంకాని పరిస్థితులు

కరువయ్యాయి తన పలకరింపులు

తనకోసం నిరీక్షించే వేళలు

నేను ఎప్పటికీ మరవని జ్ఞాపకాలు

Saturday, June 4, 2011

మన స్నేహం

ఆకు రాలినా చెట్టు చిగురుస్తూనే ఉంటుంది

పూవులు వాడినా మరో పూవు వికసిస్తూనే ఉంటుంది

ఎందరు జన్మించినా వారిని మరణం శాసిస్తూనే ఉంటుంది

మనసును చంపుకున్నా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి

ఎంత వృథా చేసినా కాలం పరిగెడుతూనే ఉంటుంది

మెతుకులు లేకపోయిన ఆహారం కోసం పక్షులు విహరిస్తూనే ఉంటాయి

సృష్టిలో ఎన్ని మార్పులున్న స్నేహం ఎప్పటికీ నిలిచే ఉంటుంది

(ఇది నా ఫ్రెండ్స్ కోసం)