Monday, May 30, 2011

జ్ఞాపకాలు

ఉరకలు, పరుగులు, ఉరుములు, మెరుపులు - చినుకులు

ఒంపుసొంపులు, వయ్యారాలు, సింగారాలు, అలంకారాలు - అందాలు

మాటలు, చూపులు, లేఖలు, తెగింపులు - ప్రేమలు

కోరికలు, బంధాలు, చిరాకులు, విడాకులు - జీవితాలు

అభిరుచులు, సహాయాలు, ధైర్యాలు, తోడునీడలు - స్నేహాలు

పూజ్యలు, మార్గదర్శకులు, సలహాలు, చాదాస్తాలు - పెద్దలు

గుడులు గోపురాలు, ప్రదక్షణాలు, పూజలు, మొక్కులు - దేవతలు

పాయాసాలు, పరవన్నాలు, పలహారాలు, శెనగలు - ప్రసాదాలు

నాయకులు, లంచాలు, కులమతభేదాలు, దోపిడిదారులు - రాజకీయాలు

ఆటలు, పాటలు, చిచ్చరపిడుగులు, అమాయకులు - పిల్లలు

చదువులు, సంస్కారాలు, కర్తవ్యాలు, గమ్యాలు - పౌరులు

అనురాగాలు, ఉద్యోగాలు, ఆలోచనలు, నిర్ణయాలు - భార్యాభర్తలు

సంవ త్సరాలు, నెలలు, వారాలు, రోజులు - క్యాలెండర్‌లు

గంటలు, నిమిషాలు, సెకనులు, ఉప సెకనులు - గడియారాలు

వాగులు, యేరులు, చెరువులు, నదులు - సముద్రాలు

జీవులు, పంచభూతాలు, సాహసాలు, శృంగారాలు - అద్భుతాలు

సుఖదుఃఖాలు, మంచి చెడులు, న్యాయ అన్యాయాలు, ధర్మ అధర్మాలు - సృష్టిధర్మాలు

వ్యాధులు, రోగాలు, జననాలు, మరణాలు - ఆసుపత్రులు

పగలు రాత్రులు, గ్రహాలు ఉపగ్రహాలు, నక్షత్రాలు, కాలాలు - జాతకాలు

సూర్య చంద్రులు, పాలపుంతలు, తోకచుక్కలు, ఉల్కలు - ఖగోళాలు

దిక్కులు, అక్షాంశాలు, రేఖాంశాలు, రేఖలు - భూగోళాలు

కేకలు, గొడవలు, కంగారులు, ఆవేశాలు - బీపీలు

వెలుగునీడలు, ఆలుమగలు, సూర్యచంద్రులు, సీతారాములు - సినిమాలు

చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, గేమ్‌లు - పిల్లల ఇష్టాలు

రస్నాలు, డ్రింకులు, మజ్జిగలు, షోడాలు - పానీయాలు

ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ఇంగువలు - శాకాహారాలు

చికెన్‌లు, మటన్‌లు, చేపలు, రొయ్యలు - మాంసాహారాలు

హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, శిక్కులు - మతాలు

బ్రహ్మణలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు - కులాలు

ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు - నేరాలు

జిలేబీలు, జాంగిరీలు, కాజాలు, మైసూరు పాకాలు - స్వీట్‌లు

కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు - లెక్కలు

భౌతికాలు, రసాయనాలు, లెక్కలు, జీవశాస్ర్తాలు - సబ్జెక్ట్‌లు

వినయాలు, గౌరవాలు, మర్యాదలు గొప్పవ్యక్తులు - ఆదర్శవంతులు

బాంబులు, ఉగ్రవాదులు, మూర్ఖులు రాక్షసులు - పాకిస్థానీలు

పక్షులు, విమానాలు, రాకెట్‌లు, హెలీకాఫ్టర్‌లు - గాల్లో వింతలు

కోపాలు, ద్వేషాలు, ఇగోలు, అలకలు - అల్లరులు

రోడ్డు, రైలు, జల, వాయుమార్గాలు - రవాణా మార్గాలు

కవ్వింతలు, గిలిగింతలు, పులకింతలు, కితకితలు - సరదాలు

ముద్దులు, కౌగిలింతలు, కలలు, బహుమతులు - జ్ఞాపకాలు

ఆస్వాదించండి

ప్రేమించేటప్పుడు వెనకా ముందు ఆలోచించరు

పార్కులు షికార్లు ఫోనుల్లో కబుర్లు ఆపరు

నువు తప్ప నాకింక లైఫ్‌లో ఎవరొద్దని అంటారు

పెళ్లి అంటే పెద్దలకు గుర్తొస్తారు

ఎవరికైనా తెలిస్తే భయపడతారు

ప్రేమను పక్కన పెట్టి గడుపుతారు

మనసు ఆలోచనలను తారుమారు చేస్తారు

అమాయక జీవితాలతో ఆడుకుంటారు

ప్రేమ ఒకటే జీవితం కాదని గ్రహించరు

ప్రేమ దొరకలేదని ఆత్మహత్య చేసుకుంటారు

నాకు దక్కనిదే ఎవరకీ దక్కకూడదని మూర్ఖంగా ప్రవర్తిస్తారు

మనకు వద్దు ఈ పరిస్థితులు... మేల్కోండి

మానవత్వాన్ని మనలో ఉందని చాటిచెప్పండి

జీవితాన్ని ఆరాధించండి ఆస్వాదించండి

ప్రేమించా - దూరంగా ఉంచా

మనసారా ప్రేమించా

ప్రేమించి చూపించా

నా కలలోకి రప్పించా

నిజాలతో తనని మెప్పించా

కాని ఇపుడు తన అబద్ధమైంది

కోపంతో మూర్ఖంగా ప్రవర్తించా

నీ ప్రేమను చంపించా

తనని నాలో తొలగించా

ప్రేమ మనకు పడదని గ్రహించా

మరో ప్రేమను దూరంగా ఉంచా

అమ్మ మనసు

నన్ను నవమాసాలు మోసిందొక అమ్మ

సృష్టిలో తీయని మాట అమ్మ

జాబిలిని చూపి గోరుముద్దులు పెడుతుంది అమ్మ

తప్పు చేస్తే మందలిస్తుంది అమ్మ

భాదపడితే ఓదార్చుతుంది అమ్మ

దెబ్బ తగిలితే భాదపడుతుంది అమ్మ

అంతటి మంచి హృదయం అమ్మ

నా ఆయష్సులో సగం ఇచ్చేస్తానమ్మా

నువు కలకాలం చల్లగ ఉండాలమ్మా

అమ్మను సృష్టించింది దైవ బ్రహ్మ

ఆ బ్రహ్మకు పాధాభివందనవమ్మా

జీవించలేను

పంచభూతాలు లేకుండా సృష్టి ఉండగలదా? ఉండలేదు

మరణం లేకుండా జీవులు జీవించగలవా? జీవించలేవు

ఆగిపొమ్మంటే కాలం ఆగిపోతుందా? ఆగిపోదు

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలమా? ఆపలేం

నీవు లేకుండా నేనుండగలనా? జీవించలేను

స్నేహాన్ని మరవలేం

ప్రేమను మరచిపోగలం - కాని మనసును చంపుకోలేం

మనిషిని ఒదులుకోగలం - కాని జ్ఞాపకాలను మరచిపోలేం

ఆవేశాలను ఆపుకోగలం - కాని ఆలోచనలను ఆపుకోలేం

వయసును దాచగలం - కాని ముసలితనంను పొమ్మనలేం

బంధాల్ని తెంచుకోగలం - కాని స్నేహాన్ని మరవలేం

మరణించా

నా గానంతో పలకరించా

నా కవితలతో కవ్వించా

ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించా

ప్రేమమత్తును ఆస్వాదించా

తన రూపాన్ని కలలోకి రప్పించా

వేయి జన్నాల ప్రేమను కురిపించా

ఏమైందో ఏమో...

నాలో స్వార్థం పెంచా

నాలో ప్రేమను దించా

నీ ప్రేమ వద్దని అరిచా

తన కలలను కరిగించా

చివరకు నేను మరణించా

ఓటు

ఓటు దానికొక రేటు

దాన్ని శాసిస్తుంది నోటు

దుర్మార్గ దుశ్శాసనలకు చోటు

మేటి నాయకులకు వేటు

ఆకలి కడుపులకు పోటు

ప్రజలు వేస్తున్నారు నాయకులు కాటు

యువత మార్చాలి రాజకీయాల రూటు

కదలండి ఎందుకు మరి లేటు

Saturday, May 28, 2011

నీ స్నేహం

పాటకు పల్లవి ప్రాణం

కోయిలకు తన గొంతు ప్రాణం

ప్రకృతికి పంచభూతాలు ప్రాణం

వెన్నెలకు రాత్రి ప్రాణం

ఇంద్రదనస్సుకి ఏడురంగులు ప్రాణం

నాకు నీ స్నేహం ప్రాణం

మన ప్రేమ

పువ్వుల మకరందం

సువాసనల సుగంధం-నీ అందం

పలకరించే పల్లవి

మనసును చలింపజేసే నీ చరణం-నీ గానం

పెదవుల తీయని మాటలు

కలలో చెరగని కోరికలు-మన స్నేహం

కల్మషం లేని నీ హృదయం

త్యాగంలాంటి నా మనసు కలియికే-మన ప్రేమ

చంపుకున్నా

నా గానంతో

- మేఘం నుండి జల్లును కురిపించా

- శిలలను కరిగించా

- మొగ్గను వికసింప చేశా

కాని,

నీ మనసును కరిగించలేక పోయా!

నా మనోవేదనను వినిపించలేక పోయా!

నా ప్రేమను నీపై ప్రకాశించలేక పోయా!

అందుకే,

నా ప్రేమను చంపుకున్నాను...

ఏమైందో ఏమో...

ప్రేమ నాలో ప్రవేశించింది

అది నా ఊపిరికి శ్వాసై పోయింది

నన్ను నేనే మరిచేటట్లు చేసింది

నా ఆలోచన తన ధ్యాసగా మారింది

ఏమైందో ఏమో...

తన చేతిని నానుండి తీసుకుంది

నా కలలు కలలుగానే మిగిలిపోయాయి

ఆ కలలే నన్ను ఒంటరిని చేశాయి

లవ్ రూట్

ఏదో తెలియని తీయని రాగం

మా మదిలో అల్లిన కమ్మని భావం

రెండు మనస్తత్వాల కలయిక స్నేహం

అదే మా ప్రేమకు మార్గం

ఫెడేల్

మా మీద మొదలయ్యాయి గాసిప్స్

ఒకసారి పార్కులో కూర్చొని తింటున్నాం చిప్స్

తొందరపడి తాకాను తన లిప్స్

నా చెంపపై వేసింది తన చేతి మ్యాప్స్

ఫిక్స్ అయ్యా...

మొదటిసారి కలిసిన డేట్ సిక్స్

మత్తెక్కిస్తాయి తన లుక్స్

మాలో మొదలయ్యాయి ప్రేమ చెక్స్

ఆరోజే అయ్యా నా కోవెల దేవతనీ ఫిక్స్

ఎవరికివారే యమునాతీరే

మాటలతో మెప్పించేయి

నీ చేష్టలతో రప్పించేయి

నీ పాటలో గొంతు కలిపించేయి

నీ చూపులతో పడగొట్టేసేయి

ఇన్ని చేస్తే గాని హాయి చేప్పేనోయి

తన ప్రేమను నాలో నింపిందోయి

మా చూపులు చేతలు కలిశాయి

మా జాతకాలు కుదిరాయి

రాబోయే రోజులన్నీ మావోయి

కాలంలో మార్పులు మారాయి

కొన్ని శక్తులు ఇద్దరి మధ్య చేరాయి

అవి మమ్మల్ని వేరు చేశాయి

ఇపుడు ఎవరికివారే యమునాతీరయ్యాయి

వేరు వేరు

ఒకరినొకరం కలుసుకున్న తారీఖు ఆరు

ఇద్దరిలో పెరిగింది ప్రేమ జోరు

ప్రకృతిని పలకరించడానికి వెళ్లాం షికారు

సృష్టిలో మా ప్రేమకు ఎవరూ సరికారు

తను మాట్లాడకపోతే ప్రతిక్షణం బోరు

తను ఏం చేస్తుందోనని కంగారూ

మరింత నా మనసు బేజారు

తనని పేరెంట్స్ క్రమశిక్షణతో పెంచారు

వాళ్లు ఆమెను హద్దుల్లో ఉంచారు

మనసులో భయాన్ని పూర్తిగా నింపారు

దానితో నా ప్రేమను కొంప ముంచారు

నా కలలను గంగలో కలిపారు

మా జీవితాలే తారుమారు చేశారు

ఇప్పుడు ఒకరికొకరం వేరు వేరు

ఆస్వాదించు

ప్రేమించండి ధైర్యంగా

ప్రేమను అంగీకరించకపోతే మారకండి మూర్ఖంగా

కాదంటే ఉండండి మౌనంగా

వారికి కాకూడదు భారంగా

ప్రవర్తించకూడదు వారిపై క్రూరంగా

ప్రవర్తిస్తే మన భవిష్యత్ నేరంగా

ఆ ప్రేమ జ్ఞాపకాలను ఆస్వాదించండి తీయంగా

Friday, May 27, 2011

మరవగలనా?

వాన మేఘాన్ని మరవగలదా?

అలలు సముద్రాన్ని మరవగలదా?

తేనెటీగ మకరందాన్ని మరవగలదా?

రాత్రి జాబిలిని మరవగలదా?

నేను నిన్ను మరవగలనా?

ఇంటర్నెట్ లవ్

ఇంటర్నెట్...

కలిపింది ఫ్రెండ్‌షిప్ ఎట్రాక్ట్...

చేసింది మా ఇద్దరిని కనక్ట్...

చివరకు అదే లవ్ ఎఫెక్ట్...

ప్రేమంటే

ఎవరైతే...

కొత్తగా పరిచయమౌతారో...

ఆ పరిచయమ్యే వాళ్లలో...

ఎవరి గురించైతే...

ఎక్కువగా ఆలోచిస్తామో...

వాళ్లపై మనకున్నదే ప్రేమ...

కనులుమూసిన నీవాయే

ఏదో తెలియని నాలో మార్పు

... కొత్తగా వింతలా అనిపిస్తుంది

నాలో నాకే ఆలోచన

... ప్రేమకోసం పరితపిస్తుంది

కనులు మూస్తే కలలో

... నా ఎదుటే ఉన్నావనిపిస్తుంది

నిన్ను చూసిన మొదటి క్షణం

... నా మనసు నా దగ్గర లేదనిపిస్తుంది

నా నీడై పోతావ్

నేను పలకరిస్తే పులకరించిపోతావు

నేను నవ్వితే సంతోషంగా ఉంటావు

నేను బాధపడితే ఓదారుస్తావు

నేను ఓడితే గెలుపుకు మార్గదర్శినవుతావు

నేను వెళ్లిన దారిలో ప్రయాణిస్తావు

ఏమంటే నువు ప్రాణమంటావు

ఎక్కడికెళ్లినా నువ్వే

ఉదయాన్నే లేస్తే నిన్నుచూడాలనిపిస్తుంది

ఎక్కడికెళ్లిన పక్కన నువుంటే బాగుండాలనిపిస్తుంది

భోజనం చేసినపుడు ఓ ముద్ద నీకు పెట్టాలనిపిస్తుంది

ఒంటరిగా ఉంటే నా ఆలోచన నీ వైపు తిరిగాలనిపిస్తుంది

పడుకుంటే నా పక్కన నువు ఉండాలనిపిస్తుంది

నా పెదవులు నీ పెదవులతో కలాలనిపిస్తుంది

మనం ఎప్పటికీ కలిసుండాలనిపిస్తుంది

మరో అద్భుతం

వర్షం పడే వేళ

వెన్నెల కురిసే వేళ

ఇంద్రధనసు మెరిసే వేళ

నలుదిక్కులు చూస్తున్న వేళ

పంచభూతాలు పలకరించే వేళ

మా రెండు మనసులు ఒకటైన వేళ

ముక్కోటి దేవతలు తదాస్తు అన్న వేళ

మా ప్రేమ ఎనిమిదో వింతగా ఉద్భవిస్తుంది

ఇది సత్యం... నిత్య నూతనం... మరో అద్భుతం...

నీకు అంకితం

నా ఊపిరి...

... నా కలల సుందరి

నా హృదయం...

... నా ప్రేమకు సొంతం

నా నిరీక్షణ...

... నా ప్రేయసి కోసం

నా తపన...

... నా చెలికి తారస పడటం

నా ఆలోచన

... నా ప్రియురాలికి చేరడం

నా చూపులు...

... నా పడతి పిలుపు కోసం

నా ఆనందం...

... నా సఖి చిరునవ్వు కోసం

నా ప్రాణం...

... నా ఎదను దోచే నీకోసం మిగిలింది

నా ప్రేమ...

... నా మనసును గెలిచే నీకోసం

నా జీవితం...

... తనకు అంకితం

తీయని మోక్షం

తీయని జ్ఞాపకం నా ప్రేయసి మనసును గెలిచినప్పుడే

తీయని క్షణం నా ప్రేయసి గుండెపై తలవాల్చినప్పుడే

తీయని ఆనందం నా ప్రేయసి పెదవులను తాకినప్పుడే

తీయని అనుభూతి నా ప్రేయసి కౌగిట్లో బంధించిన్నప్పుడే

తీయని మోక్షం నా ప్రేయసి ఒడిలో తలవాల్చి మరణించినప్పుడే

తీయని కలలు

కలిశాయి మా చేతి రేఖలు

వయసు రాసింది ప్రేమలేఖలు

వచ్చింది పెండ్లిపిలుపులు

ఆకాశంలో పందిరిలు

దివిలాంటి పెళ్లిపీటలు

ఒకటైనాయి మా మనసులు

జీవితంలో ఆనందములు

కలకాలం ఉండాలి అందరి దీవెనలు

తీర్చుకుంటాం మా తీయటి కలలు