ఆకు రాలినా చెట్టు చిగురుస్తూనే ఉంటుంది పూవులు వాడినా మరో పూవు వికసిస్తూనే ఉంటుంది
ఎందరు జన్మించినా వారిని మరణం శాసిస్తూనే ఉంటుంది
మనసును చంపుకున్నా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి
ఎంత వృథా చేసినా కాలం పరిగెడుతూనే ఉంటుంది
మెతుకులు లేకపోయిన ఆహారం కోసం పక్షులు విహరిస్తూనే ఉంటాయి
సృష్టిలో ఎన్ని మార్పులున్న స్నేహం ఎప్పటికీ నిలిచే ఉంటుంది
(ఇది నా ఫ్రెండ్స్ కోసం)
No comments:
Post a Comment