ఓ స్వప్న రాత్రి విశాలవంతమైన ఆకాశం నా మనసులాగ
ననుతాకి వేగంగా పోయే గాలి నా ఆలోచనలాగ
నిండు జాబిలిని చూసి ఒక ప్రశ్న అడిగా...
ప్రేమ అంటే ఏంటి?
ఆ జాబిలి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా...
ప్రేమ ఒక మోసం, అంధకూపం, అసూయ, పిరికిది, వ్యర్థం, నేరం-ఘోరం
అని చెప్పింది...
వెంటనే ఉవ్వెత్తిన కెరటంలా లేచి... గట్టిగా...
రెండు మనసులు కలిసి కల్మషంలేని మరో మనసుగా ఉద్భవించడమే ప్రేమ అని అరిచాను
No comments:
Post a Comment