కళ్లు పలికే ఊసులు కనులకేమో చూపులు
కలల్లో కాసే ఆశలు
నైట్ టైమ్ మేసెజ్‌లు ఫోన్లు
తను పంపే బహుమతుల కొరియార్లు
చాటింగ్‌లో తుంటరి వేషాలు
మాట వినకపోతే కోపాలు
నా మీద తన అలకలు
తన మాటలతో నాలో కవ్వింతలు
కలిసినపుడు చిలిపి చేష్టలు
తనపై కురిపించే ముద్దులు
నన్ను బంధించే కౌగిట్లు
వినిపించే నా హృదయ రాగాలు
రాశా తనపై నా మదిలో కవితలు
విడదీశాయి మమ్మల్ని కాలాలు
అర్థంకాని పరిస్థితులు
కరువయ్యాయి తన పలకరింపులు
తనకోసం నిరీక్షించే వేళలు
నేను ఎప్పటికీ మరవని జ్ఞాపకాలు
:(
ReplyDelete